Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రామ్ చరణ్ నివాసంలో పాము

టాలీవుడ్ మెగా హీరో రామ్ చరణ్ నివాసంలో ఓ పాము కలకలం రేపింది. గతరాత్రి రెండు మీటర్ల పొడవున్న పాము చెర్రీ నివాసంలోకి ప్రవేశించింది. దాన్ని చూసి అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. సెక్యూరిటీ గార్డులు ఈ విషయాన్ని రామ్ చరణ్ కు తెలిపారు. పామును చంపొద్దని, స్నేక్ సొసైటీకి ఫోన్ చేయాలని చెర్రీ సూచించారు. వెంటనే వారు స్నేక్ సొసైటీకి ఫోన్ చేయగా వారు వచ్చి ఆ పామును బంధించి తీసుకువెళ్ళారు. దీంతో, అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

More Telugu News